రత్నాలు

జ్యోతిష్య శాస్త్రము లో వివిధ దోషాలకు పరిహారంగా జపం,హోమం,దానం,రత్నం వంటి పలురకాల పరిహార క్రియలు ఉన్నాయి.ఇటీవల కాలం లో రత్నధారణ అన్నది మరింత ప్రాధాన్యత సంతరించుకుంది,అయితే రత్నం ధరించేముందు కొన్ని విషయాలు తెలుసుకోవడం మంచిది,రత్నం అన్నది పేరు బట్టి,నక్షత్రం బట్టి ధరించడం పెద్దగా సత్ఫలితాలను ఇవ్వడం లేదు,ఎక్కువశాతం నష్టాలు కూడా కలుగుతున్నాయి!
కావున రత్నం ఎవరు చెబితే అది పెట్టేయ్యకూడదు,అనుభవజ్ఞులైనవారి సలహా ముఖ్యం. నిజానికి రత్నం అన్నది ఏ విధంగా పనిచేస్తుందో తెలియదు,ఎందుకు పెట్టించాలో కూడా తెలియదు,ఆ రత్నం ధరిస్తే ఆ రత్నం తాలూకు గ్రహం మన జోలికిరాదు అన్నది చాలా మంది భావన!కాని ఇది నిజం కాదు,ఎందుకంటే ప్రతి రత్నానికి ఒక వైబ్రేషన్ ఒక రంగు కిరణాన్ని ప్రసరరింప చెయ్యడం ఉంటుంది,అలాగే ప్రతి రత్నం కూడా కెమికల్స్ కలిగి ఉంటుంది, అవి ఉండవలసిన నిష్పత్తి లో లేకుంటే అది స్వఛ్ఛమైన రత్నం కాదు,ఈ స్వఛ్ఛమైన రత్నం ద్వారా వచ్చే కిరణాలు ఆయా గ్రహానికి ప్రేరేపకాలుగా పనిచేస్తాయి,కావున మనం చెడు గ్రహానికి పెడితే దాని చెడుని మరింత ప్రేరేపించేవాళ్ళం అవుతాం,కావున రత్నాన్ని సూచించేవారు,ధరించేవారు గమనించగలరు!

Learn More

వివాహం

ఏ నెలలోనైనా 6, 15, 24 తేదిల్లో జన్మించిన వారు సంఖ్యాశాస్త్రము ప్రకారం 6 పరిధిలోకి వస్తారు చాలామంది సంఖ్యాశాస్త్ర నిపుణులు 6ని శుక్ర గ్రహానికి ప్రతీక గాను, కొద్దిమంది కుజ గ్రహ ప్రతీక గాను భావిస్తారు! శుక్రుడు ఐహిక సుఖాలకు, మగవారి జాతకాల్లో వివాహానికి కారకుడు అవుతున్నాడు. కుజుడు మనస్పర్ధలకు, స్త్రీల జాతకాల్లో వివాహానికి కారకుడు అవుతున్నాడు.
దీనిబట్టి నేను చెప్పేది ఏమిటంటే పై తేదిల్లో జన్మించిన వారిపై వివాహ పరంగా ప్రభావం ఉంటుంది,అనేక జాతకాలు పరిశీలన చెయ్యగా 75 శాతం మంది వైవాహిక విషయాల్లో ఇబ్బందులు పడటం గమనించడమైనది! అనగా వివాహం ఆలస్యం అవ్వడం, విడాకులు, ఇంట్లో ఎప్పుడూ ఎవోరకంగా వాగ్వివాదాలు వంటి వ్యతిరేక ఫలితాలు కనిపిస్తున్నాయి! కావున 6, 15, 24 తేదిల్లో జన్మించిన వారు వివాహా విషయం లో శ్రద్ధ తీసుకోండి, తొందరపాటు పడవద్దు. ఇప్పటికే ఇబ్బంది పడుతున్నవారు నిత్యం అర్ధనారీశ్వరుని ఆరాధించండి.
ఇక అలాగే మే నెలలో వివాహాలు కూడా ఎక్కువ విజయవంతం అవ్వడం లేదు. ఈ నెలలో 2, 4, 6, 11, 13, 17, 20, 22, 24 తేదిల్లో ముహూర్తాలు ఉంటే మరింత జాగ్రత్త గా చూసి నిర్ణయానికి రావాలి. అందరి విషయం లో ఇవి యదార్ధం కాకపోవచ్చు. కాని చాలామంది వ్యతిరేక ఫలితాలు పొందారు. మీ వైవాహిక జీవితాలు మూడు పువ్వులు, ఆరుకాయలు గా శుభప్రదం, ఫలప్రదం కావాలన్న ఉద్దేశ్యం తో అందుకు ఈ పరిశీలన మీకు ఉపయుక్తంగా ఉంటుంది అని ఆశిస్తున్నాం!

Learn More

కలహాలు

ఈ రోజుల్లో చాలా మంది ఎదుర్కొంటున్న ముఖ్య సమస్యల్లో కుటుంబ కలహాలు ఒకటి
ఇంట్లో ఒకరిమాట ఒకరికి రుచించక పోవడం, చిన్న విషయానికే పెద్ద పెద్ద గొడవలు
అయిపోవడం ఆపై తీరిగ్గా బాధపడిపోవడం ఇవాళ మామూలు విషయమే!
జాతకరీత్యా దీనికి ప్రధాన కారక గ్రహం కుజుడు.  అలాగే కుటుంబ స్థానానికి కారకమైన
గ్రహం బావుండకపోయినా కూడా గొడవలు వస్తాయి!  సరే కారణం ఏదైనా ఇవి
తగ్గించుకోవడానికి సులభ పరిహారాలు రాత్రి సాధ్యమైనంతవరకు వంటింట్లో అంట్లు నిల్వ ఉంచవద్దు!
పడకగది లో రాత్రి బల్బ్ ఉపయోగిస్తే నీలి లేదా ఆకుపచ్చ రంగు వాడండి!  పొద్దున లేవగానే ఇంట్లో ఎంతమంది ఉన్న కరచాలనం చేసుకోండి!  దక్షిణం వైపు కాకుండా పడమర వైపు తిరిగి ముఖం కడగండి!  దక్షిణం లో నీటికి సంబంధించిన వస్తువులు పెట్టవద్దు. మంగళ వారాలు పన్నెండు ఏళ్ళ పిల్లలకు కారపు వంటకాలు పెట్టండి!
దేవునిపై నమ్మకం ఉన్నవారు సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువ పూజించండి!
ఆరు మంగళవారాలు ఏడు మినప దోసెలు ఆయనకు నివేదన చేసి
కుటుంబంలో అందరూ వాటిని ఫలహారం గా తీసుకోవచ్చు!

Learn More

విష్ణుప్రియ ఆస్ట్రో & రెమెడీస్ వరల్డ్ 

మా సంస్ధ జ్యోతిష్కులు శ్రీ కంచి శేషగిరి రావు రెండు దశాబ్దాలకు పైగా జ్యోతిష్య రంగం లో ఉండి, ప్రజల సమస్యలకు తగు పరిష్కారాన్ని సూచిస్తున్నారు.  వాస్తవ ఫలితాలు -సులభ పరిహారాలు వీరి ప్రత్యేకత! దాదాపు లక్షన్నరకు పైగా జాతకాలను పరిశీలించిన అనుభవజ్ఞు లు.  భక్తి, మహా, ఎన్ టివి, ఎ టివి వంటి ప్రముఖ ఛానెల్స్ జ్యోతిష్య , రత్న సంభంద ప్రత్యక్ష ప్రసారాలలో పాల్గొని వీక్షకులు అడిగే ప్రశ్నలకు తగు పరిష్కారాలను సూచించారు.  హైదరాబాద్, ఇప్పుడు విశాఖపట్నం లో ఒక ప్రఖ్యాత రత్నాల సంస్థకు ప్రధాన జ్యోతిష్కులుగా తమ సేవలు అందిస్తుచన్నారు.  ఇప్పుడు మా వెబ్ సైట్ వీరి జ్యోతిష్య నేతృత్వంలో ముందుకు సాగనున్నది.  ఆయన సలహాలని పొందగోరు వారు ఈ వెబ్ సైట్ లో రిజిస్టర్ అయి ఉండాలి.  అటువంటి సభ్యులకు ముఖ్యమైన ఒక ప్రశ్నకు ఉచితం గా జవాబు ఇస్తారు.  పూర్తి జాతకం కావాలి అన్నా లేదా మాచే అందించబడే వివిధ సేవలు ఉపయోగించుకోవాలి అనుకునే వాళ్ళు మా ఈ మెయిల్ అడ్రస్ లేదా ఫోన్ నెంబర్ ద్వారా సంప్రదించగలరు!

మాచే అందించబడే సేవలు :
జాతకము తయారు చేయుట - ఫలితాలు ఇవ్వుట
వివాహ పొంతన
రత్న సూచన - అమ్మకం
జపాలు చేయుట
పిల్లలకు వారు పుట్టిన తేదిని బట్టి పేరుని నిర్ణయించుట

కంచి శేషగిరి రావు గారు

మా సేవలకై సంప్రదించండి . . .

మీకు గల సందేహాలను నివృత్తి చేసుకొనుట కొరకు, సమస్యలకు పరిష్కారము తెలిసికొనుట కొరకు, జాతక చక్రములకు లేదా ఏదైనా జీవిత సంబంధ ప్రశ్నలకు ఈమెయిల్ లేదా ఫోన్ ద్వారా సంప్రదించండి . . .

గురువుగారిని వ్యక్తిగతం గా హైదరాబాద్ లో కలవదలచిన వారు ఫోన్ చేయగలరు.