నవ రసాలు – నవ గ్రహాలు

ప్రతీ మనిషి ముఖంలో/గుణంలో నవరసాలు చోటు చేసుకుంటాయి అన్నది అందరికీ విదితమే!
 అయితే ఈ భావాలన్నీ పలికించేందుకు నవగ్రహాలలో ఏదో ఒక గ్రహం కారణం అవుతుందని 
 చాల మందికి తెలియదు.  ఇప్పుడు ఏ గ్రహం ఏ రసానికి కారణం అవుతుందో మనము
 తెలుసుకుందాం. 
 రవి - రౌద్రం 
 చంద్రుడు - కరుణ 
 కుజుడు - వీరం 
 బుధుడు - హాస్యం 
 గురుడు - శాంతం 
 శుక్రుడు - శృంగారం 
 శని - భీభత్సం 
 రాహు - అద్భుతం 
 కేతువు - భయానకం
అయితే ఈ నవ రసాలన్నీ ఒకేసారి నటీనటులు పలికించడానికి ప్రధాన కారణము రాహువు. 
 కళల్లో రాణించడానికి శుక్రుడు, చంద్రడు కూడా అవసరమే. అలాగే ఎవరిలో ఏ గుణం 
 ఎక్కువగా ఉంటే అందుకు పైన పేర్కొన్న గ్రహాలను బట్టి తెలుసుకోండి.  అలాగే అవి
 మితి మీరి మనలో ఉండి, సమస్యలు తెచ్చిపెడుతున్నాయి అనుకుంటే అందుకు కారణమైన
 గ్రహాలను బట్టి వాటి అధిష్టానదేవతలని ఆరాధించడం వలన వాటిని మనం తగ్గించుకోవచ్చు.

3 thoughts on “నవ రసాలు – నవ గ్రహాలు”